Mon Dec 15 2025 06:28:10 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. వాహనాలు దగ్దం
హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అబిడ్స్ లోని బాణసంచా దుకాణంలో పెద్దయెత్తున మంటలు చెలరేగాయి

హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అబిడ్స్ లోని బాణసంచా దుకాణంలో పెద్దయెత్తున మంటలు చెలరేగాయి. ఆస్తి నష్టం బాగా జరిగింది. నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బొగ్గులకుంటలోని ఒక బాణసంచా దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులతో బయటకు పరుగులు తీశారు. ఆదివారం కావడంతో ఎక్కువ రద్దీ ఉంది. అయితే వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.
బాణాసంచా దుకాణంలో...
ఐదు అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తేగలిగాయి. అక్కడ వాహనాలు కూడా మంటల్లో పడి దగ్దమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు గాయపడి చికిత్స పొందుతున్నారు. దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన షాపులోనే మంటలు చెలరేగాయి. అయితే చుట్టుపక్కలకు వ్యాప్తి చెందకుండా మంటలను అదుపు చేయగలిగారు. సరైన నియమ నిబంధనలను పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Next Story

