Mon Dec 23 2024 08:02:08 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో మరో భారీ అగ్ని ప్రమాదం
రాజేంద్రనగర్ శాస్త్రిపూరం లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్లాస్టిక్ గోదాము తగలపడుతోంది
రాజేంద్రనగర్ శాస్త్రిపూరం లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్లాస్టిక్ గోదాము తగలపడుతోంది. ఈ ప్రమాద ఘటనలో రెండు డీసీఎం వాహనాలు కూడా పూర్తిగా దగ్దమయ్యాయి. మంటలు పెద్దయెత్తున ఎగిసి పడుతుండటంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
శాస్త్రిపురంలో...
మంటలకు తోడు వ్యాపించిన దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.అగ్నిమాపక సిబ్బంది కి, పోలీసులకు సమాచారం స్థానికులు ఇవ్వడంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. రెండు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు.
Next Story