Fri Nov 15 2024 17:21:22 GMT+0000 (Coordinated Universal Time)
Liquor Sales In Telangana : భారీగా లిక్కర్ సేల్స్.. ఎప్పుడూ లేనంత రికార్డు స్థాయిలో
తెలంగాణలో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఎన్నడూ లేనంతగా దసరా పండగకు లిక్కర్ సేల్స్ జరిగాయి.
తెలంగాణలో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఎన్నడూ లేనంతగా దసరా పండగకు లిక్కర్ సేల్స్ జరిగాయి. దసరా పండగకు ఎక్కువ మంది సొంతూళ్లకు వెళ్లి ఎంజాయ్ చేయడం అలవాటు. బంధువులు, చిన్ననాటి స్నేహితులందరూ కలసి పార్టీలు చేసుకోవడం కొన్నేళ్లుగా తెలంగాణ పల్లెల్లో నడుస్తుంది. దసరా రోజు మద్యంతో పాటు మాంసంతో అందరూ కలసి భోజనం చేయడం కూడా అలవాటే. అందుకే మద్యం ఎక్కువగా అమ్ముడవుతుందని ఎక్సైజ్ అధికారులు ముందుగానే అంచనా వేసి మరీ ఎక్కువ స్థాయిలో మద్యం బాటిల్స్ ను అందుబాటులో ఉండేలా చేయడంతో ఒక్కసారిగా సేల్స్ పెరిగాయి.
ఏపీకి వెళ్లేవారు...
గ్రామాల్లో లిక్కర్ షాపులుండకపోవడంతో హైదరాబాద్ జిల్లా కేంద్రాల నుంచి మద్యం బాటిల్స్ ను ఎక్కువగా కొనుగోలు చేసుకుని తీసుకెళుతుంటారు. గ్రామాల్లో ఒకవేళ లభించినా చీప్ లిక్కర్ లభిస్తుండటంతో హైదరాబాద్ నుంచి బ్రాండెడ్ మద్యం బాటిల్స్ ను ఎక్కువ మంది కొనుగోలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దసరా పండగ తెలంగాణలో పెద్ద పండగ కావడంతో పాటు అందరూ కలసి సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకే ఈ పండగకు మద్యం సేల్స్ ఎక్కువయ్యాయంటున్నారు ఎక్సైజ్ అధికారులు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే వారు కూడా అక్కడ మద్యం బాటిల్స్ బ్రాండెడ్ వి దొరుకుతాయో? లేదోనని భావించి ఒకటో రెండో తమ వెంట తీసుకెళుతున్నారు.
దసరాకు ముందు...
దీంతో దసరాకు ముందు భారీగా మద్యం అమ్మకాలు పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. దసరా సెలవులు దాదాపు పదిహేను రోజులు ఇవ్వడంతో ఇప్పటికే గ్రామాల బాట పట్టారు జనం. అందుకే గత తొమ్మిది రోజుల నుంచి మద్యం అమ్మకాలు 713 కోట్ల రూపాయల మేర జరిగాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ స్థాయిలో మద్యం అమ్మకాలు జరగడం రికార్డు బ్రేక్ అని అంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయం భారీగా లభించడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు, రేపు మరింతగా మద్యం అమ్మకాలు పెరుగుతాయన్న అంచనాలో ఎక్సైజ్ అధికారులున్నారు.
Next Story