Thu Apr 03 2025 06:15:10 GMT+0000 (Coordinated Universal Time)
America : అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్ యువకుడి మృతి
అమెరికాలో కాల్పులు జరిగాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ కు చెందిన యువకుడు మరణించారు.

అమెరికాలో కాల్పులు జరిగాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ కు చెందిన యువకుడు మరణించారు. యువకుడు హైదరాబాద్ లోని చైతన్యనురికి సమీపంలోని ఆర్కేపురానికి చెందిన రవితేజగా గుర్తించారు. రవితేజ ఉన్నత చదువులు నిమిత్తం 2022 లో అమెరికాకు వెళ్లారు. అక్కడ ఎంఎస్ చేసిన రవితేజ అక్కడే ఉంటున్నారు.
కారణాలు మాత్రం...
అయితే దుండగులు ఎందుకు కాల్పులు జరిపిందీ కారణాలు తెలియరాలేదు. రవితేజ మరణ వార్త విని కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు. రవితేజ మృతదేహాన్ని భారత్ కు తీసుకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇటీవల కాలంలో అమెరికాలో కాల్పుల ఘటనలకు తెలుగు యువకులు బలవుతున్న సంగతి తెలిసిందే.
Next Story