Thu Nov 21 2024 22:26:42 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : హమ్మయ్య.. వేడిగాలులు తగ్గాయి.. కానీ?
నిన్నటి వరకూ ఉక్కపోతతో అలమటించి పోయిన ప్రజలకు కొంత ఊరట కలుగుతుంది.
నిన్నటి వరకూ ఉక్కపోతతో అలమటించి పోయిన ప్రజలకు కొంత ఊరట కలుగుతుంది. క్రమంగా చలి తీవ్రత పెరుగుతుంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో, హైదరాబాద్ లోనూ గత రెండు మూడు రోజుల నుంచి చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. చలిగాలులు మొదలు కావడంతో దుప్పట్లో దూరిపోతున్నారు. మొన్నటి వరకూ వేసవి తీవత్రత మామూలుగా లేదు. ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. అక్టోబరు నెలలోనూ ఇదేమి ఉక్కపోత అంటూ విడ్డూరపోయాం.
విద్యుత్తు బిల్లులు...
అంతే కాదు విద్యుత్తు బిల్లులు కూడా తడిచి మోపెడయ్యాయి. సాధారణంగా జులై నుంచి ఏసీల వాడకం హైదరాబాద్ నగరంలో తగ్గుతుంది. ఆగస్టు నుంచి అయితే కొందరు ఫ్యాన్లు కూడా తెల్లవారు జామున బంద్ చేసుకుంటారు. అక్టోబరు నెల రెండో వారమైనా ఉష్ణోగ్రతలు తగ్గక పోవడం, ఉక్కబోత ఎక్కువగా ఉండటంతో ఏసీలు నిరంతరాయంగా పనిచేశాయి. విద్యుత్తు బిల్లులు కూడా మోత మోగాయి. హైదరాబాద్ లాంటి నగరంలో ఈ పరిస్థితి ఎప్పుడూ లేదన్న కామెంట్స్ వినిపించాయి.
పండగ ముందురోజు వరకూ...
దసరా ముందు రోజు వరకూ ఇదే పరిస్థితి. ప్రజలు ఈ వాతావరణంతో అనేక రకాల వ్యాధుల బారిన పడ్డారు. న్యూమోనియా సోకి ఎక్కువ మంది రోగులు ఆసుపత్రి పాలయ్యారు. ఇక వైరల్ ఫీవర్ తో ఆసుపత్రులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. జలుబు, దగ్గు, జ్వరంతో పాటు ఒళ్లు నొప్పులు, తలనొప్పితో జనం అల్లాడి పోయారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులన్నీ కిటకిటలాడిపోయాయి. ఆసుపత్రుల్లో బెడ్స్ కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. పండగ వేళ ఈ రోగాలేంటి భగవంతుడా? అని అనుకోని వారు లేరు.
చలి తీవ్రత...
కానీ గత రెండు రోజుల నుంచి వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపించాయి. చలి పెరగడమే కాదు.. ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి. ఉదయం వేళల్లో మంచు కురవడం ప్రారంభమయింది. అచ్చమైన అక్టోబరు నెలకు వచ్చేశామని పిస్తుంది. అయితే దీనివల్ల కూడా కొన్ని రకాల జబ్బులు వచ్చే అవకాశముందని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. మంచులో ఎక్కువగా తిరగకుండా, ఎండ వచ్చిన తర్వాతే మార్నింగ్ వాక్ వంటివి చేయడం మంచిదన్న సూచనలు వినిపిస్తున్నాయి.
Next Story