Mon Apr 07 2025 20:58:22 GMT+0000 (Coordinated Universal Time)
లెక్కల మాస్టార్ లెక్క తేలుస్తున్న ఆదాయపు పన్ను శాఖ
హైదరాబాద్ లో మూడోరోజు ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు సినీ ప్రముఖుల ఇళ్లలో జరుగుతున్నాయి.

హైదరాబాద్ లో మూడోరోజు ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు సినీ ప్రముఖుల ఇళ్లలో జరుగుతున్నాయి. మొన్నటి నుంచి నిర్మాతలు, దర్శకలు ఇళ్లలో ఐటీ శాఖ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. సినిమా విడుదలవ్వడం, భారీ బడ్జెట్ తో సినిమా ను తెరకెక్కించడం, అంతే స్థాయిలో ఆదాయం వచ్చినప్పటికీ లెక్కలు సరిగా చూపకుండా ఆదాయపు పన్ను ఎగవేశారన్న ఆరోపణలపై ఈ సోదాలు జరుపుతున్నారు.
సుకుమార్ ఇంట్లో...
సినినిర్మాత దిల్ రాజు, శిరీష్ లతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ ఇళ్లు, కార్యాలయాలు, పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు నేడు కూడా జరుగుతున్నాయి. సుకుమార్ ఇంట్లో రెండో రోజు కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పుష్ప 2 సినిమా 1800 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడంతో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఇటీవల సంక్రాంతికి విడుదలయిన సినిమాల నిర్మాతలందరి ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు.
Next Story