Sun Dec 22 2024 14:30:43 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాద్ యువకుల మృతి
హైదరాబాద్కు చెందిన ముగ్గురు యువకులు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు
హైదాబాద్కు చెందిన ముగ్గురు యువకులు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. మొత్తం నలుగురు ఈ ఘటనలో మరణించగా అందులో ముగ్గురు హైదరాబాద్ కు చెందిన వారు. మరొకరు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. మృతులు హైదరాబాద్ కు చెందిన ఆర్యన్ రఘునాధ్, ఫరూఖ్, లోకేశ్, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ఉన్నారు. కార్లో వెళ్లేందుకు బెన్టోన్విల్లె ప్రాంతానికి బయలుదేరగా ఐదు వాహనాలు ఒకదానిని ఒకటి ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.
కార్ పూలింగ్ లో...
డల్లాస్ లోని బంధువులను కలసి ఇంటికి ఆర్యన్ రఘునాధ్ వెళుతున్నారు. భార్యను కలిసేందుకు లోకేష్, యూనివర్సిటీకి దర్శినీ వాసుదేవన్, ఫరూఖ్ కారు పూలింగ్ లో ఈ వాహనంలో ఎక్కారు. అయితే ప్రమాదంలో వీరు ప్రయాణిస్తున్న కారుకు మంటలు అంటుకుని అగ్నికి ఆహుతయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story