Tue Apr 22 2025 07:06:58 GMT+0000 (Coordinated Universal Time)
నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
నేడు హైదరాబాద్ లో హనుమాన్ శోభాయాత్ర జరుగుతుంది. గౌలిగూడ నుంచి తాడిబండ్ ఆంజనేయస్వామి దేవాలయం వరకూ యాత్ర జరుగుతుంది.

నేడు హైదరాబాద్ లో హనుమాన్ శోభాయాత్ర జరుగుతుంది. గౌలిగూడ నుంచి తాడిబండ్ ఆంజనేయస్వామి దేవాలయం వరకూ యాత్ర జరుగుతుంది. హనుమత్ జయంతి కావడంతో ఈ శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ శోభాయాత్రలో వేలాది వాహనాలతో పాటు లక్షలాది మంది భక్తులు పాల్గొనడటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
శోభాయాత్ర వెళ్లే మార్గంలో...
శోభాయాత్ర వెళ్లే మార్గంలో పోలీసులు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం నుంచి శోభాయాత్ర ప్రారంభం కానుండటంతో ప్రత్యామ్యాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు వాహనదారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. కరీంనగర్ లోనూ శోభాయాత్ర నేపథ్యంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ మద్యం షాపులు బంద్ చేయాలని అధికారులు నిర్ణయించారు. కొండగట్టు హనుమాన్ దేవాలయానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు.
Next Story