Thu Apr 24 2025 20:03:50 GMT+0000 (Coordinated Universal Time)
Ramdan : నేడు పవిత్ర రంజాన్
నేడు పవిత్ర రంజాన్ ను ముస్లిం సోదరులు జరుపుకుంటున్నారు.

నేడు పవిత్ర రంజాన్ ను ముస్లిం సోదరులు జరుపుకుంటున్నారు. నిన్న నెలవంక కనిపించడంతో నేడు రంజాన్ పండగను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో రంజాన్ సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మసీదుల వద్ద ట్రాఫిక్ ఆంక్షలను విధించింది. ఈరోజు ఉదయం మసీదు వద్ద ప్రార్థనలు చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవాకశముండటంతో ఆంక్షలు విధించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
నెల రోజుల పాటు...
నెల రోజుల పాటు పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలున్న ముస్లింసోదరులు ఈరోజు రంజాన్ పండగను జరుపుకుంటున్నారు. మసీదులో ప్రార్ధనలు చేసిన తర్వాత పేదలకు అన్నదానం చేస్తారు. అన్నవస్త్రాలను దానం చేస్తే మంచిదని భావిస్తారు. హైదరాబాద్ ప్రాంతంలోని అన్ని మసీదులను ప్రత్యేకంగా విద్యుత్తు దీపాలంకరణలతో రాత్రి నుంచి అలంకరించారు.
Next Story