Wed Oct 30 2024 05:31:49 GMT+0000 (Coordinated Universal Time)
థన్ తెరాస్ నాడు తగ్గిన బంగారం కొనుగోళ్లు
థన్ తెరాస్ నేడు కూడా కొనసాగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది బంగారం కొనుగోళ్లు తగ్గాయంటున్నారు.
థన్ తెరాస్ నేడు కూడా కొనసాగుతుందని వ్యాపారాులు చెబుతున్నారు. థన త్రయోదశి శుభ ఘడియలు ఈరోజు అంటే బుధవారం మధ్యాహ్నం వరకూ ఉండటంతో పసిడి కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతాయని వ్యాపారులు భావిస్తారు. నిజానికి మంగళవారం నుంచి త్రయోదశి ప్రారంభమైంది. అది బుధవారం మధ్యాహ్నం వరకూ కొనసాగుతుందని పండితులు చెబుతున్న మేరకు ఈరోజు కూడా బంగారం బిజినెస్ జరుగుతుందని వ్యాపారులు భావిస్తున్నారు.
నేడు కూడా...
థన్ తెరాస్ రోజు బంగారం కొని లక్ష్మీదేవి అమ్మవారి ఎదుట ఉంచి పూజిచేస్తే మంచిదని భావిస్తారు. కానీ బంగారం ధరలు పెరగడంతో ఆశించినంత మేర కొనుగోళ్లు జరగలేదని వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు పదిహేను శాతం తగ్గాయని అంటున్నారు. దీంతో ఈరోజు కూడా శుభఘడియలు ఉన్నందున బంగారం కొనుగోళ్లు జరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. నెలాఖరు రావడంతోనే కొనుగోళ్లు తగ్గాయని కొందరు చెబుతున్నారు.
Next Story