ఆగస్టు 14, 15 తేదీల్లో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. తెలుసుకోండి..!
గోల్కొండ కోటకు వెళ్లే వివిధ రహదారుల దగ్గర ట్రాఫిక్‌ను మళ్లిస్తారు.
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. తెలంగాణ ప్రభుత్వం గోల్కొండ కోటలోని రాణి మహల్ లాన్లో ఇండిపెండెన్స్ డే వేడుకలను నిర్వహిస్తోంది. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రామ్‌దేవ్‌గూడ నుంచి గోల్కొండ కోటకు వెళ్లే రహదారిని మూసి వేస్తున్నారు. గోల్కొండ కోటకు వెళ్లే వివిధ రహదారుల దగ్గర ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. షేక్‌పేట నాలా, టోలీచౌకీ, సెవెన్ టూంబ్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. సాధారణ ప్రజలు షేక్‌పేట, టోలీటౌకీ ప్రాంతం నుంచి గోల్కొండ కోటకు చేరుకోవాలి. వారి వాహనాలను సెవెన్ టూంబ్స్ దగ్గర పార్క్ చేయాల్సి ఉంటుంది. గోల్కొండ కోటకు వచ్చే వాహనాలకు పోలీసులు నాలుగు రకాల పాసులు జారీ చేశారు. గోల్డ్, పింక్, బ్లూ, గ్రీన్ కలర్లో ఉండే మూడు రకాల పాసులను జారీ చేశారు. సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసాబ్‌ట్యాంక్, మెహిదీపట్నం ప్రాంతాల నుంచి వీరంతా గోల్కొండ కోటకు చేరుకోవాల్సి ఉంటుంది. గోల్డ్ కలర్ పాసులు ఉన్న వాహనదారులు ఫతే దర్వాజ రోడ్లో ఉన్న గోల్కొండ కోట ముందున్న స్థలంలో తమ వాహనాలను పార్క్ చేయాల్సి ఉంటుంది. పింక్ కలర్ పాసులు ఉన్న వాహనదారులు గోల్కొండ బస్ స్టాప్‌లో తమ వాహనాలను పార్క్ చేయాలి. బ్లూ కలర్ పాసులు ఉన్న వాహనదారులు గోల్కొండ బస్ స్టాప్‌కు రైట్ సైడ్ లో ఉన్న ఫుట్‌బాల్ గ్రౌండ్లో వెహికిల్స్ పార్క్ చేయాలి. గ్రీన్ కలర్ పాసులు ఉన్న వాహనదారులు సెవెన్ టూంబ్స్ నుంచి వాహనాలను పార్క్ చేయాలి.