Mon Dec 23 2024 12:40:12 GMT+0000 (Coordinated Universal Time)
శిల్పారామం నుండి శంషాబాద్ విమానాశ్రయానికి టీఎస్ఆర్టీసీ బస్సులు
హైదరాబాద్ సిటీ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోవడం మరింత సులువు కానుంది.
హైదరాబాద్ సిటీ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోవడం మరింత సులువు కానుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)హైటెక్ సిటీలోని శిల్పారామం నుండి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బస్సు సర్వీసును ప్రకటించింది. విమానాశ్రయానికి ప్రయాణించే ప్రయాణికులకు సులభమైన, మంచి ప్రయాణ అనుభవాన్ని అందించడానికి ఈ చర్యలు తీసుకుంది టీఎస్ఆర్టీసీ. ఇకపై ప్రైవేట్ వాహనాలపై ఆధారపడకుండా టీఎస్ఆర్టీసీ బస్సుల్లో హ్యాపీగా ఎయిర్ పోర్టుకు చేరుకోవచ్చు.
టీఎస్ఆర్టీసీ ప్రకారం, శిల్పారామం నుండి ప్రతి 30 నిమిషాలకు మెట్రో లగ్జరీ బస్సులు బయలుదేరుతాయి. ఈ సేవలు ఉదయం 4:30 గంటలకు ప్రారంభమై రాత్రి 10:30 వరకు నడుస్తాయి. ఈ మార్గంలో ప్రతిరోజూ ప్రయాణించే వారికి 10 శాతం రాయితీ అందించబడుతుందని, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులకు 20 శాతం తగ్గింపు అందించబడుతుందని ప్రకటన విడుదల చేసింది. "శంషాబాద్ ను హైటెక్ సిటీకి మరింత దగ్గర చేస్తూ ప్రతి అరగంటకొక బస్సు మరియు ప్రతి రోజూ ప్రయాణించే వారికి 10 శాతం రాయితీ." అంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
- Tags
- TSRTC
Next Story