Fri Dec 20 2024 14:22:01 GMT+0000 (Coordinated Universal Time)
మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు
సైబరాబాద్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు
సైబరాబాద్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ వెంకట్ , ఆర్జీఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ లను సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి నిర్ణయం తీసుకున్నారు. వ్యక్తినినిద్భందించి చిత్రహింసలు పెట్టారని, దంపతుల వివాదం విషయంలో కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ అమానుషంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ కారణాలతోనే...
ఒక కేసు విషయంలో విచారణ చేయనందుకు ఆర్జీఐ ఇన్స్పెక్టర్ ను అవినాష్ మహంతి సస్పెండ్ చేశారు. వీరిపై శాఖాపరమైన విచారణ జరుగుతుందని తెలిపారు. విచారణ అనంతరం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై నిర్ణయం ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. వరసగా పోలీసు అధికారులపై సస్పెన్ వేటు పడటంతో పోలీసు వర్గాల్లో టెన్షన్ మొదలయింది.
Next Story