Mon Dec 23 2024 17:41:59 GMT+0000 (Coordinated Universal Time)
Kishan Reddy : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ నగర వాసులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు
హైదరాబాద్ నగర వాసులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే ఏడాది డిసెంబరు నెలలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు పూర్తవుతాయని తెలిపారు. డిసెంబరు నెలలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని తెలిపారు. ఇప్పటికే చర్లపల్లి రైల్వే స్టేషన్ ను అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేశామని, పనులు పూర్తి కావచ్చాయని, త్వరలోనే ఈ స్టేషన్ ను ప్రారంభిస్తామని తెలిపారు. చర్లపల్లి రైల్వేస్టేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం రోడ్ కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని కోరారు.
నాంపల్లి రైల్వే స్టేషన్...
ఆయన మీడియాతో మాట్లాడుతూ డిసెంబరు నెలలోనే నాంపల్లి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. తెలంగాణకు మూడు మేజర్ రైల్వే టెర్మినల్స్ ఉన్నాయని తెలిపారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా టిక్కెట్ కౌంటర్ల సంఖ్య కూడా పెంచనున్నట్లు తెలిపారు.
Next Story