Thu Dec 26 2024 15:26:40 GMT+0000 (Coordinated Universal Time)
గరుడ ప్రసాదం కోసం క్యూ కట్టిన భక్తులు... 4కి.మీ ట్రాఫిక్
హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు లో నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి
హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు లో నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చిలుకూరి బాలాజీ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. సంతానం లేని వారికి గరుడ ప్రసాదం పంపిణీ చేస్తామని ఆలయ నిర్వాహకులు ప్రకటించడంతో హైదరాబాద్ తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో చిలుకూరుకు చేరుకున్నారు. దీంతో చిలకూరు బాలాజీ దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతుంది.
ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు...
మరోవైపు భక్తుల సంఖ్య ఎక్కువగా రావడం, సొంత వాహనాలతో వచ్చి దేవాలయాని చేరుకుంటుండటంతో ట్రాఫిక్ స్థంభించింది. నాలుగు కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. విధులకు వెళ్లాల్సిన వారికి ఇబ్బందికరంగా మారుతుంది. పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్ నియంత్రణను చేపట్టారు.
Next Story