ఘనంగా “Vvyasa” యాన్యువల్ డే
హైదరాబాద్‌లోని వ్యాస విద్యా సంస్థ వార్షిక దినోత్సవ (యాన్యువల్ డే) వేడుకలు “ఆలోక” పేరిట బౌరంపేటలోని వారి క్యాంపస్‌లో ఘనంగా జరిగాయి.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని వ్యాస విద్యా సంస్థ వార్షిక దినోత్సవ (యాన్యువల్ డే) వేడుకలు “ఆలోక” పేరిట బౌరంపేటలోని వారి క్యాంపస్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు బుర్ర కథలు, జానపద కథలతో పాటు పర్యావరణ సమస్యలు-పరిష్కారాలను వివరిస్తూ వేసిన నాటిక ఆహుతలను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా రిషి వ్యాలీ స్కూల్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ జి. జయ ప్రకాష్ రావు, ముఖ్య అతిథిగా సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ డిసిపి కోగంటి శిల్పవల్లి హాజరయ్యారు. వీరు చక్కటి ప్రదర్శన చేసిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా పాఠశాల యాజమాన్యం జయప్రకాశ్‌రావు, శిల్పవల్లిని సత్కరించింది.
శివ పద్మావతి బత్తుల: వ్వ్యాస పాఠశాల వ్యవస్థాపకురాలైన ఈమె బోధనారంగంలో తన అపారమైన అనుభవాన్ని ఆహుతులతో పంచుకున్నారు. అదేవిధంగా తమ విద్యాసంస్థ ప్రతి విద్యార్థి పై తీసుకునే శ్రద్ధతో పాటు విద్యార్థుల మనోవికాసం కోసం ఏడాది పొడుగున నిర్వహించిన వివిధ కార్యక్రమాల గురించి తెలియజేశారు.
సాహితీ వడకట్టు: సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న వీరు పాఠశాలలో విద్యార్థులకు కల్పించే సౌకర్యాలు, విధ్యాబోధనలోని నూతన విధానాల గురించి తల్లిదండ్రులకు, అతిధులకు తెలియజేశారు. అదేవిధంగా యాన్యువల్ డే ను విజయవంతంగా నిర్వహించడానికి తమవంతు కృషి చేసిన టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్‌తో పాటు యజమాన్యానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
ఎకోఫ్రెండ్లీ క్యాంపస్
హైదరాబాద్‌లోని ఉత్తమ CBSE పాఠశాలల్లో వ్యాస స్కూల్ ఒకటిగా పేరుగాంచింది. పాఠశాల్లోని తరగతి గదుల్లోకి గాలి, వెలుతురు బాగా వస్తుంది. దీంతో విద్యార్థులు ప్రకృతి ఒడిలో చదువుకుంటున్న అనుభూతి పొందుతారు. అంతేకాకుండా పాఠశాల మౌలిక సదుపాయాలు నాన్-టాక్సిక్ లేటరైట్ స్టోన్ బ్లాక్‌లను ఉపయోగించి నిర్మించబడ్డాయి. దీంతో అతి తక్కువ స్థాయిలో కార్బన్ ఉద్గారాలు వెలువడుతాయి. అందువల్లే వ్యాస స్కూల్ క్యాంపస్ ఎకోఫ్రెండ్లీ క్యాంపస్‌గా ఖ్యాతి గడించింది. మరోవైపు అతి పెద్ద ప్లేగ్రౌండ్ కూడా ఈ విద్యాసంస్థ సొంతం. విద్యార్థులు ఆరోగ్యం పై విద్యాసంస్థ ప్రత్యేక శ్రద్ధవహిస్తుంది. అందులో భాగంగా ఉత్తమ ఆహారఅ లవాట్లను ప్రోత్సహించడంలో భాగంగా ప్రతి విద్యార్థికి అత్యుత్తమ భోజనాన్ని అందజేస్తుంది.
వ్యాస స్కూల్లోని ఉపాధ్యాయులు విద్యార్థులకు అత్యుత్తమ విలువలతో కూడిన విద్యాబోధనను అందజేస్తారు. ఉపాధ్యాయులు సంబంధిత సబ్జెక్టులలో ఆచరణాత్మక విధానంలో విధ్యా బోధన చేస్తారు. అంతేకాకుండా నైతిక విలువలు, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ (సమస్యకు విభిన్నకోణంలో పరిష్కారం ఆలోచించడం) నేర్పిస్తారు.
విద్యార్థులు శారీరకంగా ఎదగడానికి, ఆరోగ్యంగా ఉండటానికి క్రీడలు చాలా ముఖ్యమని పాఠశాల యాజమాన్యం విశ్వసిస్తుంది. అందుకే ఇక్కడ చదివే పిల్లలకు బాస్కెట్‌బాల్, వాలీబాల్, క్రికెట్ మరియు బ్యాడ్మింటన్‌తో సహా అనేక ఇండోర్, క్రీడలను అందుబాటులో ఉంచింది.
ఈ సంస్థ విద్యావిధానంలో అభ్యాసం, విజ్ఞానం, మూల్యాంకనం, విద్యార్థుల్లో ఐఖ్యత అనేవి నాలుగు మూల స్తంభాలు.
వ్యాస సంస్థ బోధనా పద్ధతులు
- 21వ శతాబ్దపు నైపుణ్యాలతో కూడిన బోధనా విధానం
- విజువల్ మరియు పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌తో కూడిన బోధన
- చిన్నపిల్లలకు అంటే ప్రైమరీ స్టూడెంట్స్‌కు వారు ఇష్టపడే బొమ్మలతో కూడిన విద్యా బోధన
- మల్టీ-డిసిప్లినరీ ప్రాజెక్ట్‌లు మరియు ఇంటరాక్టివ్ క్లాస్రూమ్ టీచింగ్
- చేయడం ద్వారా నేర్చుకోవడం (లర్నింగ్ బై డూయింగ్)
- సహకార మరియు అనుభవపూర్వక అభ్యాస పద్ధతులు
అడ్మిషన్స్ కొరకు స్కూల్ యజమాన్యాని సంప్రదించగలరు - వ్వ్యాస స్కూల్ వెబ్సైట్