Mon Dec 23 2024 05:34:26 GMT+0000 (Coordinated Universal Time)
రోడ్డుపై బైక్ మీద దూసుకుపోతున్న ఈయన ఎవరో తెలుసా?
తనదైన శైలిలో బైక్ మీద దూసుకుపోతున్న ఈయన
ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తనదైన శైలిలో మోటర్‌బైక్‌పై స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నారు. తన ట్రయంఫ్ క్రూయిజర్ హ్యాండిల్‌కు రెండు జాతీయ జెండాలను అమర్చారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఎంపీ తన నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలలో తిరిగారు. చారిత్రాత్మక చార్మినార్ సమీపంలోని మదీనా సర్కిల్లో గతంలో మాదిరిగానే ఒవైసీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ ఏడాది ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించారు.
రోడ్లపై బైక్‌లు నడపడం అంటే ఇష్టపడే అసదుద్దీన్ ఒవైసీ శాస్త్రిపురంలోని తన నివాసం నుంచి బైక్‌పై బయలుదేరి పలు ప్రాంతాలను చుట్టేశారు. ఆయనతో పాటు ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది, కొందరు అనుచరులు బైక్‌పై వచ్చారు. అతని తండ్రి, దివంగత సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ, 1970- 1980లలో తన నార్టన్ మోటార్‌సైకిల్‌పై తన నియోజకవర్గాన్ని సందర్శించేవారు. అసదుద్దీన్ ఒవైసీ తరచూ కారులో ప్రయాణిస్తుంటారు.. కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రం ఆయన మోటర్‌బైక్‌పై రోడ్లపైకి వస్తారు.
Next Story