Sat Nov 23 2024 04:59:36 GMT+0000 (Coordinated Universal Time)
పగిలిన మంచినీటి పైప్.. ఆ వ్యాన్ డ్రైవర్ ఏం చేశాడో చూడండి
ఒక వైపు భారీ వర్షాలు కురుస్తుంటే.. మరోవైపు నడిరోడ్డు మధ్యలో ఫౌంటెయిన్ లా నీరు ఎగసిపడుతోంది. దీంతో ఆ మార్గంలో..
హైదరాబాద్ లో గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. నిన్న ఉదయం నుంచి కాస్త వర్షం తెరపించినా.. సాయంత్రానికి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో నగరమంతా అతలాకుతలం అయింది. భారీ ఎత్తున వరద నీరు రోడ్లమీదకి చేరుకోవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకచోట పిడుగులు పడిన సందర్భం కూడా చోటుచేసుకుంది.
ఒక వైపు భారీ వర్షాలు కురుస్తుంటే.. మరోవైపు నడిరోడ్డు మధ్యలో ఫౌంటెయిన్ లా నీరు ఎగసిపడుతోంది. దీంతో ఆ మార్గంలో వెళ్లేవాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గుడిమల్కాపూర్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. అక్కడెక్కడ ఫౌంటెయిన్ ఉంది అనే ఆలోచనలో పడ్డారా. అది ఫౌంటెయిన్ కాదండీ గుడిమల్కాపూర్ కూడలి వద్ద మంచినీటి పైపు లీకేజ్ అయ్యి పెద్ద ఎత్తున నీళ్లు ఫౌంటెయిన్ లాగా రోడ్డు పైకి ఎగిసిపడుతున్నాయి. భారీ ఎత్తున నీళ్లు రోడ్డుపై ప్రవహిస్తూ ఉండడంతో రోడ్డు మొత్తం జలమయమైంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు ఆకుకూరలు సరఫరా చేసే ఒక మినీ ట్రాలీ ఆకులను తడిపేందుకు ఏకంగా వాహనాన్ని తీసుకువెళ్లి ఫౌంటెన్ కింద పెట్టేసాడు. అది చూసిన స్థానికులు వాహనం డ్రైవర్ తెలివికి ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే జలమండలి అధికారులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని లీకేజీ పైపుకు మరమ్మతులు చేసి సరి చేశారు.
Next Story