Wed Apr 09 2025 18:32:07 GMT+0000 (Coordinated Universal Time)
రెండురోజులు నీటి సరఫరా బంద్
జంటనగరాల్లో రెండు రోజుల పాటు నీటి సరఫరా బంద్ అవుతుంది. ఈ మేరకు జలమండలి ఒక ప్రకటనలో తెలిపింది

జంటనగరాల్లో రెండు రోజుల పాటు నీటి సరఫరా బంద్ అవుతుంది. ఈ మేరకు జలమండలి ఒక ప్రకటనలో తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నీటి సరఫరా రెండు రోజులు పాటు ఉండదని అధికారులు తెలిపారు. గోదావరి నీటి నుంచి వచ్చే పైపులైన్లకు మరమ్మతులు జరుగుతుండటంతో రెండు రోజుల పాటు నీటి సరఫరా ఉండబోదని అధికారులు వెల్లడించారు.
ముందుగానే....
ఇందుకు జంట నగరవాసులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. మంచినీటి సరఫరాకు అంతరాయం కలుగుతుండటంతో ముందుగానే నీటిని స్టోర్ చేసి పెట్టుకోవాలని సూచిస్తున్నారు. దీంతో జంటనగరవాసులు మంచినీటికి ఇబ్బంది పడకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Next Story