Mon Dec 23 2024 06:28:54 GMT+0000 (Coordinated Universal Time)
వింగ్స్ ఇండియా ఎయిర్ షో ప్రారంభం
హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా ప్రదర్శన ప్రారంభమయింది
హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా ప్రదర్శన ప్రారంభమయింది. ఈ ప్రదర్శనను గురువారంనాడు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. పౌర విమానయానశాఖ ఆధ్వర్యంలో వైమానిక ప్రదర్శన నాలుగు రోజుల పాటు సాగుతుంది. ఈ నెల 21వ తేదీ వరకు ఈ వైమానిక ప్రదర్శన నిర్వహించనున్నారని నిర్వాహకులు తెలిపారు.
ప్రదర్శనలో...
వింగ్స్ ఇండియా ప్రదర్శనలో నూట ఆరు దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు పాల్గొననున్నట్లు నిర్వాహకులు చెెప్పారు. భారీ విమానాలు, చార్టెడ్ ఫ్లైట్లు, చాపర్లు, హెలికాప్టర్లను ఈ ప్రదర్శనలో ఉంచుతున్నారు. ఈ ప్రదర్శనకు వచ్చేందుకు ఈ నెల 20, 21 తేదీల్లో సాధారణ సందర్శకులకు అనుమతి ఉంటుంది.
Next Story