Mon Dec 23 2024 07:40:51 GMT+0000 (Coordinated Universal Time)
ఆగష్టు 15 ను ఎందుకు, ఎలా భారత స్వాతంత్ర్య దినోత్సవంగా ఎంపిక చేయబడింది?
ఆగస్టు 15, 2022న, భారతదేశం తన 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ కార్యక్రమానికి
ఆగస్టు 15, 2022న, భారతదేశం తన 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ కార్యక్రమానికి గుర్తుగా, భారత ప్రభుత్వం 'ఆజాదీ కా అమృత్ మోహత్సవ్' లో భాగంగా 'నేషన్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్' అనే థీమ్తో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని 200 మిలియన్ల త్రివర్ణ పతాకాలను ఎగురవేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భారతీయులందరికీ ఈ రోజు ప్రత్యేకమైనది. ఢిల్లీలోని ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఇది స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించిన సంప్రదాయం, నేటికీ కొనసాగుతోంది. ఈ ఏడాది ఆనవాయితీలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.
1757లో ప్లాసీ యుద్ధంలో ఈస్టిండియా కంపెనీ విజయం సాధించడంతో భారతదేశంలో బ్రిటిష్ పాలన ప్రారంభమైంది. మన దేశంపై పూర్తి నియంత్రణను ఇచ్చింది. ఈస్టిండియా కంపెనీ భారతదేశాన్ని దాదాపు ఒక శతాబ్దం పాటు పరిపాలించింది. బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా 1857-58 లో భారతీయులు తిరుగుబాటు చేశారు. దీన్ని మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం అంటారు. సంవత్సరాల పోరాటం తర్వాత.. భారతీయులు బ్రిటిష్ వారిని దేశం విడిచిపోయేలా చేశారు. బ్రిటీషర్ల తమ పట్టును వదులుకోవలసి వచ్చింది. బ్రిటీష్ పార్లమెంట్ జూన్ 30, 1948 నాటికి భారతదేశానికి అధికారాన్ని బదిలీ చేయమని లార్డ్ మౌంట్ బాటన్కు ఆదేశాన్ని ఇచ్చింది. మౌంట్ బాటన్ భారతదేశం చివరి బ్రిటిష్ గవర్నర్-జనరల్ అనే సంగతి తెలిసిందే. అయితే స్వాతంత్ర్య సమరయోధులు మాత్రం భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడంలో జాప్యంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతో మౌంట్ బాటన్ ఆ తేదీని ఆగష్టు 15, 1947గా తీసుకుని వచ్చారు. రక్తపాతం లేదా అల్లర్లు తనకు ఇష్టం లేదని.. అలాంటివి జరగకుండా చూడాలని భావించాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయిన రెండవ వార్షికోత్సవం సందర్భంగా మౌంట్ బాటన్ ఆగస్టు 15ని భారత స్వాతంత్ర్య తేదీగా ఎంచుకున్నాడు. మౌంట్ బాటన్ నిర్ణయం తర్వాత, బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామన్స్ జూలై 4, 1947న భారత స్వాతంత్ర్య బిల్లును ఆమోదించింది. భారతదేశం, పాకిస్థాన్ అంటూ రెండు వేర్వేరు దేశాలుగా విభజించారు.
Next Story