Sun Dec 22 2024 23:06:12 GMT+0000 (Coordinated Universal Time)
'ఇంక్విలాబ్ జిందాబాద్' స్లోగన్ ను తీసుకుని వచ్చింది ఎవరో తెలుసా..?
'ఇంక్విలాబ్ జిందాబాద్' స్లోగన్ ను తీసుకుని వచ్చింది ఎవరో తెలుసా..?
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో నినాదాలు కూడా ఎంతో ప్రాముఖ్యతను సొంతం చేసుకున్నాయి. ఎన్నో స్లోగన్స్ భారత స్వాతంత్ర్యాన్ని మలుపు తిప్పాయి. వాటిలో 'ఇంక్విలాబ్ జిందాబాద్' (విప్లవం వర్ధిల్లాలి) కూడా ఒకటి. ఈ నినాదాన్ని 1921లో మౌలానా హస్రత్ మోహని మొదటిసారి ఉపయోగించారని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. మోహనీ (1875-1951) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ జిల్లాలోని మోహన్ అనే పట్టణంలో జన్మించారు. విప్లవ ఉర్దూ కవిగా హస్రత్ అతని కలం పేరు (తఖల్లుస్) గా మారింది. ఇది రాజకీయ నాయకుడిగా కూడా ఆయనకు ఒక గుర్తింపుగా మారింది. హస్రత్ మోహని కార్మిక నాయకుడు, పండితుడు, కవి.. 1925లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులలో ఒకరు.
స్వామి కుమారానంద్తో పాటు భారత కమ్యూనిస్ట్ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. 1921లో కాంగ్రెస్ అహ్మదాబాద్ సెషన్లో మోహని మొట్టమొదట సారి 'సంపూర్ణ స్వాతంత్ర్యం' డిమాండ్‌ను లేవనెత్తారు. 1920ల మధ్యకాలంలో ఈ నినాదం భగత్ సింగ్, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (HSRA)లు తమ యుద్ధానికి నినాదంగా మార్చుకున్నాయి. భగత్ సింగ్ కూడా పాతకాలపు వివక్షా విధానాలను విచ్ఛిన్నం చేసేందుకు సామాజిక విప్లవం రావాలని ఆకాంక్షించారు. ఏప్రిల్ 8, 1929న అసెంబ్లీలో బాంబులు విసిరి, 'ఇంక్విలాబ్ జిందాబాద్' అని అరిచినప్పుడు ఈ నినాదం పెద్దగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంక్విలాబ్ అన్నది వలసవాదంతో పాటు సామాజిక మరియు ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలనే మోహనీ ఆకాంక్ష నుండి ప్రేరణ పొందింది.
News Summary - ‘Inquilab Zindabad’ was first used by Maulana Hasrat Mohani in 1921
Next Story