Sun Dec 22 2024 22:37:57 GMT+0000 (Coordinated Universal Time)
స్వాతంత్రోద్యమాన్ని మలుపు తిప్పిన 'స్వదేశీ ఉద్యమం'
దేశ ప్రజలంతా ఆ తర్వాత కూడా స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించారు. విదేశీ వస్తు బహిష్కరణ జరిగింది.
భారతదేశ స్వాతంత్రోద్యమాన్ని మలుపు తిప్పిన నిరసనోద్యమం 'స్వదేశీ ఉద్యమం'. ఈ ఉద్యమం ఆగస్ట్ 7, 1905న మొదలవ్వడంతో ఒక్కసారిగా బ్రిటిష్ పాలకులకు వెన్నులో భయం పుట్టుకొచ్చింది.
భారత వైస్రాయ్ లార్డ్ కర్జన్ బెంగాల్ 20 జూలై 1905న విభజనను ప్రకటించగా.. అక్టోబర్ 1905 లో బెంగాల్ విభజన జరిగింది. లార్డ్ కర్జన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారతదేశమంతా తీవ్రంగా వ్యతిరేకించింది. బెంగాల్ విభజన వెనుక, భారతీయుల హిందూ-ముస్లిం ఐక్యతను విచ్ఛిన్నం చేసే కుట్ర ఉంది. బ్రిటీష్ వారు ముస్లింలు అధికంగా ఉండే తూర్పు భాగాన్ని అస్సాంలో విలీనం చేసి ప్రత్యేక ప్రావిన్స్ ఏర్పాటు చేశారు.పశ్చిమ బెంగాల్ పేరు పెట్టడానికి హిందువులు ఎక్కువగా ఉండే పశ్చిమ భాగాన్ని బీహార్, ఒరిస్సాలో విలీనం చేశారు. రెండు ప్రావిన్సులలో రెండు వేర్వేరు మతాలను మెజారిటీగా చేయాలని బ్రిటిష్ వారు కోరుకున్నారు. దేశవ్యాప్తంగా విభజన నిరసన ప్రారంభమైంది. 7 ఆగస్టు 1905 న, కలకత్తా టౌన్ హాల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు అయింది. లక్షలాది మంది ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో బహిష్కరణ తీర్మానాన్ని ఆమోదించారు. దీనితో స్వదేశీ ఉద్యమం లాంఛనంగా ప్రారంభమైంది.
బెంగాల్ విభజనను నిరసిస్తూ కోల్‌కతాలోని టౌన్ హాలులో 1905 ఆగస్టు 7 న భారీ జన సభ నిర్వహించారు. ఈ సభకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది హాజరయ్యారు. బ్రిటీషర్ల తీరును నిరసనగా వారి ఆధ్వర్యంలో నడుస్తున్న కార్యాలయాలు, పాఠశాలలు, కోర్టుల సేవలు వినియోగించుకోకూడదని, వారి వస్తువులను వాడకూడదని తీర్మాణం చేశారు. ఇక్కడి నుంచే స్వదేశంలో తయారయ్యే వస్తువులను మాత్రమే ఉపయోగించాలని తీసుకున్న నిర్ణయంతో స్వదేవీ ఉద్యమం ఊపందుకుంది. విదేశీ దుస్తులను దేశవ్యాప్తంగా కాల్చివేయడం ప్రారంభించారు ప్రజలు. విదేశీ వస్తువుల బహిష్కరణ ప్రభావం భారతదేశంలో విదేశీ వస్తువుల అమ్మకం పూర్తిగా తగ్గింది. స్వదేశీ వస్తువుల అమ్మకం పెరగడం ప్రారంభమైంది. బ్రిటిష్ వారి ఈ నిర్ణయానికి నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ 'అమర్ షోనార్ బంగ్లా' కూడా వ్రాసాడు, తరువాత ఇది బంగ్లాదేశ్ జాతీయ గీతంగా మారింది. ప్రజలు ఈ పాటను పాడుతూ నిరసనలలో పాల్గొనేవారు. హిందువులు, ముస్లింలు తమ ఐక్యతను చాటుకోవడానికి ఒకరికొకరు రాఖీలు కట్టుకున్నారు. నిరసనలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నప్పటికీ బ్రిటీష్ ప్రభుత్వం అక్టోబర్ 16 న బెంగాల్‌ను విభజనను అమలుచేసింది. తీవ్ర మనోవేధనకు గురైన భారతీయులు ఈ రోజును జాతీయ సంతాప దినోత్సవంగా జరిపారు. దేశ ప్రజలంతా ఆ తర్వాత కూడా స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించారు. విదేశీ వస్తు బహిష్కరణ జరిగింది.
News Summary - Swadeshi Movement began during the 1900s when massive agitation and unrest were carried out across the country
Next Story