Sun Jan 12 2025 01:34:12 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh Budet : ఏపీ సమావేశాల్లో కేటాయింపులివే.. పయ్యావుల ప్రసంగం
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. 2019లో గత ప్రభుత్వం విధ్వంసంతో పాలనను ప్రారంభించిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పతనం అంచున ఉందని తెలిపారు. 2.94 కోట్ల రూపాయల అంచనాతో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీసిందని పయ్యావుల కేశవ్ ఆన్నారు. రెవెన్యూ అంచనా వ్యయం 2.34 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. రాబోయే నాలుగు నెలల కాలానికి ఈ బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఈ శాసనసభలో ప్రవేశపెట్టినట్లయింది. శాశ్వత రాజధాని లేకుండా రాజధాని విభజన జరిగిందని పయ్యావుల కేశవ్ తెలిపారు.
రాష్ట్ర పునర్నిర్మాణానికి...
రాష్ట్రాన్ని పునర్మిణానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పయ్యావుల కేశవ్ తెలిపారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 16,379 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగాయి. ద్రవ్యలోటు 68,743 కోట్ల రూపాయలుగా ఉంది. ఉన్నత విద్యకు 2,326 కోట్ల రూపాయలు, పరిశ్రమలు, వాణిజ్యం 3,127 కోట్ల రూపాయల నిధులను కోటాయించింది. జలవనరుల శాఖకు 16,705 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. పట్టణాభివృద్ధికి 11,490 కోట్ల రూపాయల నిధులను కేటాయింపులు జరిపింది. బీసీ సంక్షేమానికి 3,709 కోట్ల రూపాయలు, ఉన్నత విద్యకు 2,326 కోట్ల రూపాయలను కేటాయింపులు జరిపింది.
కేటాయింపులివే...
ఇంథన రంగానికి 8,704 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 7,500 కోట్ల రూపాయలను కేటాయింపులు జరిపింది. పోలీసు శాఖకు 8,495కోట్ల రపాయలు, మైనారిటీ సంక్షేమానికి 3,745 కోట్ల రూపాయలను కేటాయించింది. నైపుణ్యాభివృద్ధి శాఖకు 1,215 కోట్ల రూపాయలను కేటాయింపులు ఈ బడ్జెట్ లో జరిపింది. అటవీ వపర్యావరణ శఖకు 687 కోట్ల రూపాయలు, గృహనిర్మాణ శాఖకు 4,312 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ఈ ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయింపులు జరిపింది. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పయ్యావుల కేశవ్ తెలిపారు.
Next Story