Union Budget : 2047 నాటికి పేదరికం కనపడదు.. మధ్యతరగతిపై వరం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 -25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్ ను లోక్సభలో ప్రవేశపెట్టారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 -25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్ ను లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆరోసారి బడ్జెట్ ను నిర్మలా సీతామన్ ప్రవేశపెట్టారు. పదేళ్లలో మోదీ నాయకత్వంలో తీసుకు వచ్చిన ఆర్థిక సంస్కరణలు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయని తెలిపారు. బాధ్యతాయుతంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్సాహాన్ని నింపాయన్నారరు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదం భారత ఆర్థిక మూలాలను పటిష్టం చేసిందని నిర్మలా సీతారామన్ తెలిపారు.ఆర్మనిర్బణ భారత్ నిర్మాణంలో ప్రతి వ్యక్తి భాగస్వామ్యులయ్యారన్నారు. కూనారిల్లుతున్న వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం ఊతమిచ్చిందని తెలిపారు. మద్దతు ధరలు, పెట్టుబడి రాయితీలతో రైతులకు మరింత ప్రయోజనం చేకూరిందన్నారు. నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామికవేత్తలు పుట్టుకొచ్చారని నిర్మలా సీతారామన్ తెలిపారు.