Sun Dec 22 2024 20:02:56 GMT+0000 (Coordinated Universal Time)
మరణిస్తే... అధికారి వెకిలి కామెంట్స్
అమెరికా పోలీసు అధికారి వెకిలి చేష్టలు కంపరం పుడుతున్నాయి. కందుల జాహ్నవి ఈ ఏడాది జనవరిలో రోడ్డు ప్రమాదంలో చనిపోయింది.
అమెరికా పోలీసు అధికారి వెకిలి చేష్టలు కంపరం పుడుతున్నాయి. ఏపీకి చెందిన కందుల జాహ్నవి ఈ ఏడాది జనవరిలో రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆమె మృతికి సంబంధించి ఒక అమెరికన్ పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కేవలం పదకొండు వేల డాలర్లు ఇస్తే సరిపోతుందని నవ్వుతూ మాట్లాడుతుండటంపై సర్వత్రా అభ్యంతరం వ్యక్తమవుతుంది. జాహ్నవి మృతికి వెలకట్టిన అధికారిపై చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుతున్నారు. పోలీసు వాహనం ఢీకొని మృతి చెందితే నవ్వుతూ..వెకిలిగా చిన్న వయసులో చనిపోయిన ఆమెకు అంత పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని అంటున్న ఆయన ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది
ఏపీకి చెందిన...
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన ఇరవై మూడేళ్ల కందుల జాహ్నవి ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లింది. ఆమె ఈ ఏడాది జనవరిలో ఒక పోలీసు వాహనం ఢీకొట్టి మృతి చెందింది. అయితే ఈ ఏడాది జనవరి 23న కెవిన్ డేవ్ అనే పోలీసు అధికారి నడుపుతున్న వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె మరణించింది. అయితే ఆమె మరణం పట్ల పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలు బయటకు రావడంతో అమెరికా పోలీసుల రేసిజం బయటపడింది. దీనిపై నెటిజన్లు అభ్యంతరం తెలుపుతున్నారు. అమెరికాలోని తెలుగు సంఘాలు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తన వ్యాఖ్యలకు ఆ అధికారి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.
Next Story