Thu Dec 26 2024 23:53:04 GMT+0000 (Coordinated Universal Time)
ఐదువేల మందికిపైగా మృతి
వరద బీభత్సానికి లిబియా అతలాకుతలమైంది. వేల సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. దాదాపు ఐదు వేల మంది మరణించారు
వరద బీభత్సానికి లిబియా అతలాకుతలమైంది. వేల సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకూ దాదాపు ఐదు వేల మందికి పైగానే మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇళ్లలో ఉన్న వారు ఉన్నట్లే మృత్యువాత పడ్డారు. వరదకు తోడు డ్యామ్ లు తెగడం కూడా ఈ ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఇంట్లో ఉన్న వాళ్లు అలాగే వరద నీటిలో కొట్టుకు పోవడంతో భయానకరమైన పరిస్థితి లిబియాలో నెలకొంది.
వరదల దెబ్బకు...
గత కొద్ది రోజులుగా పడుతున్న భారీ వర్షాలకు లిబియా వణికిపోతుంది. ముఖ్యంగా డెర్నా నగరం సగం నీటిలో మునిగి పోయింది. ఇళ్లలో ఉన్న వారు ఉన్నట్లే చనిపోయారు. వరదల ధాటికి అనేక భవనాలు కుప్పకూలిపోయాయి. సహాయక చర్యలు ప్రారంభించినా వెదుకులాట సిబ్బందికి కష్టంగా మారింది. ఒక్కసారిగా వరదలు సంభవించడంతో ఎటూ పోలేక మృత్యువాతపడిన వారు వేల సంఖ్యలోనే ఉంటారు. ప్రతి కుటుంబంలో ఒక విషాదం వినిపిస్తుంది. తట్టుకోలేని పరిస్థితుల్లో లిబియా దేశం ఉంది.
బురదలో...
ఇక రోడ్లు అయితే నామరూపాల్లేకుండా పోయాయి. మృతదేహాలను గుర్తుపట్టడం కూడా కష్టంగా మారింది. వేల సంఖ్యలో ఉన్న మృతదేహాలలో తమ వారెవరో గుర్తించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. మృతదేహాల్లో తమ వారు ఉండకూడదని ప్రార్థనలు చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇక కార్లు అయితే వరదల్లో కొట్టుకుపోయాయి. ఆస్తి నష్టం ఎంత అనేది అంచనా వేయడం కూడా కష్టంగా మారింది. బురద పేరుకుని పోయి ఉండటంతో అందులోనుంచి మృతదేహాలను వెలికి తీయడం సహాయక బృందాలకు కష్టంగా మారింది. ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలేవీ పెద్దగా సత్ఫలితాలిస్తున్నట్లు కనిపించడం లేదు. అనేక మంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొందరు కొన ఊపిరితో ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. మొత్తం మీద లిబియాలో ఈ పెను విషాదం ఆ దేశాన్ని కోలుకునివ్వకుండా చేసింది.
Next Story