Mon Dec 23 2024 05:40:57 GMT+0000 (Coordinated Universal Time)
బ్రూక్లీన్ సబ్ వే లో కాల్పులు .. పలువురికి గాయాలు
బ్రూక్లీన్ నగరంలోని ఓ రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో అనేకమంది గాయాలపాలైనట్లు తెలుస్తోంది.
అగ్రరాజ్యం అమెరికా కాల్పుల మోతతో దద్దరిల్లింది. న్యూయార్క్ లోని బ్రూక్లీన్ సబ్ వే జరిగిన కాల్పుల్లో పలువురు మృతి చెందారు. బ్రూక్లీన్ నగరంలోని ఓ రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో అనేకమంది గాయాలపాలైనట్లు తెలుస్తోంది. తొలుత ట్రైన్లోనే కాల్పులు చేసిన సాయుధుడు.. ఆ తర్వాత స్నో గ్రెనేట్ వదిలి.. ట్రైన్ స్టేషన్లో ఆగగానే మరికొంతమందిపై కాల్పులు జరిపాడు.
అక్కడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటనా స్థలంలో కొన్ని పేలుడు పదార్థాలు కూడా లభ్యమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో బ్రూక్లిన్ లోని 36వ స్ట్రీట్ పరిసరాలను మూసివేశారు. పౌరులు ఎవరూ అటుగా వెళ్లొద్దని స్పష్టం చేశారు. రద్దీ సమయంలో ఘటన జరగడంతో నిందితుడు పోలీసులకు దొరక్కుండా పారిపోయాడు. నిందితుడి కోసం హెలికాఫ్టర్ స్క్వాడ్ గాలిస్తోంది. ఇది ఉగ్రవాద చర్య ? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపారా ? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఈ దాడి ఘటనతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్ని రకాల కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఇది ఉగ్రదాడి అయి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో అధికారులతో అత్యవసర భేటీ నిర్వహించనున్నారు.
Next Story