Sun Mar 30 2025 09:08:04 GMT+0000 (Coordinated Universal Time)
కూలిన బొగ్గు గని .. 14 మంది బలి
బొగ్గుగని కుప్పకూలిన ప్రమాదంలో 14 మంది దుర్మరణం చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. సాన్హే షంగ్జన్ బొగ్గు గనిలో ..

చైనా : బొగ్గు గని కుప్పకూలడంతో.. 14 మంది బలయ్యారు. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. నైరుతి చైనాలోని గుయిజూ ప్రావిన్సులో బొగ్గుగని కుప్పకూలిన ప్రమాదంలో 14 మంది దుర్మరణం చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. సాన్హే షంగ్జన్ బొగ్గు గనిలో ఫిబ్రవరి 25న పైకప్పు కూలిపోవడంతో అక్కడే పనిచేస్తున్న కార్మికులు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు వెంటనే సహాయక చర్యలు మొదలుపెట్టారు. కానీ ఫలితం లేకపోయింది.
ఈ ప్రమాదంలో 14 మంది చనిపోగా.. వారి మృతదేహాలు మార్చి 6వ తేదీన బయటపడినట్లు అధికారులు వివరించారు. 10 రోజులుగా కార్మికులను కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా వారిని ప్రాణాలతో బయటికి తీసుకురాలేకపోయారు సహాయకసిబ్బంది. గని ప్రవేశ ద్వారం నుండి దాదాపు 3 కిలోమీటర్లు (1.9 మైళ్ళు) పైకప్పు కూలిపోవడంతో.. సహాయక చర్యలు కష్టతరమయ్యాయి.
Next Story