Mon Dec 23 2024 04:47:19 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రైలు ప్రమాదం.. 15 మంది మృతి
పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సింధ్ ప్రావిన్స్‌లో ఎక్స్‌ప్రెస్ రైలులోని
పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సింధ్ ప్రావిన్స్‌లో ఎక్స్‌ప్రెస్ రైలులోని అనేక బోగీలు పట్టాలు తప్పడంతో కనీసం 15 మంది మరణించారు దాదాపు 50 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. కరాచీ నుంచి రావల్పిండి వెళ్తున్న హజారా ఎక్స్‌ప్రెస్ రైలు సింధ్ ప్రావిన్స్‌లోని నవాబ్షా జిల్లాలోని సర్హరి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. దెబ్బతిన్న బోగీల నుండి కనీసం 15 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పాకిస్తాన్ రైల్వే డిప్యూటీ సూపరింటెండెంట్ మహమూద్ రెహ్మాన్ ధృవీకరించారు.
కరాచీకి 275 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టేషన్‌కు సమీపంలో రైలు కంపార్ట్మెంట్లు బాగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది, పోలీసులు పట్టాలు తప్పిన కంపార్ట్మెంట్ల నుండి ప్రజలను బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. హజారా ఎక్స్‌ప్రెస్ కరాచీ నుంచి అబోటాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లోని నవాబ్షా నగరంలోని సహారా రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ప్రమాదంలో ఓ కోచ్ పూర్తిగా బోల్తా పడింది. దీంతో 15 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.
పాకిస్తాన్ సైన్యం, రేంజర్లు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించినట్లు ప్రభుత్వ రేడియో పాకిస్తాన్ నివేదించింది. ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ప్రత్యేక ఆదేశాల మేరకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. సహాయక చర్యలకు అదనపు బలగాలను రప్పించారు. గాయపడిన వారిని రక్షించేందుకు ఆర్మీ హెలికాప్టర్లు కూడా ఘటనాస్థలికి చేరుకుంటున్నాయి.
Next Story