Mon Dec 23 2024 20:28:17 GMT+0000 (Coordinated Universal Time)
పాక్ లో దారుణం.. హిందూ యువతి కాల్చివేత
ఈ ఘటన దక్షిణ సింధ్ ప్రావిన్స్ లో రోహి పట్టణం, సుక్కూర్ లో చోటు చేసుకుంది. పాక్లో హిందూ యువతులను అపహరించడం, ముస్లిం..
సింధ్ ప్రావిన్స్ : పాకిస్థాన్ లో దారుణ ఘటన వెలుగుచూసింది. హిందూ యువతిని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన దక్షిణ సింధ్ ప్రావిన్స్ లో రోహి పట్టణం, సుక్కూర్ లో చోటు చేసుకుంది. పాక్లో హిందూ యువతులను అపహరించడం, ముస్లిం యువకులతో పెళ్లి చేయడం, అనంతరం మత మార్పిళ్లకు పాల్పడడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే 18 ఏళ్ల హిందూ యువతిని దుండగులు అపహరించేందుకు ప్రయత్నించారు.
దుండగులతో యువతి ప్రతిఘటించడంతో.. ఆమెపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. హిందూ యువతి కాల్చివేతపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. 2013- 2019 మధ్య 156 బలవంతపు మతమార్పిళ్ల ఘటనలు చోటు చేసుకున్నాయని పీపుల్స్ కమిషన్ సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్ ఓ నివేదికలో పేర్కొంది. పాక్లో హిందువుల జనాభా 1.60 శాతంగా ఉండగా, వారి మొత్తం జనాభాలో సింధ్ ప్రాంతంలో అత్యధిక శాతం ఉన్నారు.
Next Story