Tue Dec 24 2024 01:02:22 GMT+0000 (Coordinated Universal Time)
భూమివైపు దూసుకొస్తున్న విమానం సైజు గ్రహశకలం.. ప్రమాదం పొంచి ఉందా ?
ఈ గ్రహశకలం కదలికలను ఫిబ్రవరిలో గుర్తించామని, అప్పట్నుండీ దాని కదలికలపై నిఘా పెట్టినట్లు వివరించింది. ఈ గ్రహశకలానికి..
భారీ విమానం సైజులో ఉన్న గ్రహశకలం ఒకటి భూమివైపు ప్రచండ వేగంతో దూసుకొస్తోందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. ఈ గ్రహశకలం కదలికలను ఫిబ్రవరిలో గుర్తించామని, అప్పట్నుండీ దాని కదలికలపై నిఘా పెట్టినట్లు వివరించింది. ఈ గ్రహశకలానికి నాసా శాస్త్రవేత్తలు 2023 ఎఫ్ జెడ్ 3గా నామకరణం చేశారు. ప్రస్తుతం గంటకు 67వేల కిలోమీటర్ల వేగంతా భూమివైపు దూసుకొస్తోందన్న నాసా సైంటిస్టులు.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
గురువారం అంటే ఏప్రిల్ 6వ తేదీకి ఈ గ్రహశకలం భూమికి 41 లక్షల కిలోమీటర్ల దూరంలో నుంచి వెళ్తుందని అంచనా వేశారు. కాగా.. అంతరిక్షంలో మొత్తం 30 వేలకు పైగా గ్రహశకలాలు చక్కర్లు కొడుతున్నాయని వెల్లడించారు. వాటిలో సుమారు 850 శకలాలు భారీ పరిమాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. వాటిలో కిలోమీటర్ల కొద్దీ పొడవున్న శకలాలు కూడా ఉన్నాయని వివరించారు. మరో 100 సంవత్సరాల వరకూ ఈ గ్రహశకలాలతో భూమికి వచ్చే ముప్పేమీ లేదని నాసా సైంటిస్టులు స్పష్టం చేశారు.
Next Story