Mon Dec 23 2024 13:50:03 GMT+0000 (Coordinated Universal Time)
బంగారు గనిలో అగ్నిప్రమాదం.. 27 మంది మృతి
షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలుడు సంభవించడంతో మంటలు వ్యాప్తి చెందాయని, ప్రమాద సమయంలో గనిలో కార్మికులు వందమీటర్ల..
దక్షిణ అమెరికాలోని పెరులో గల గోల్డ్ మైన్స్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 27 మంది కార్మికులు మరణించారు. మృతులు నైట్ షిఫ్ట్ లో పనిచేస్తుండగా ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల కాలంలో దేశంలో జరిగిన అత్యంత విషాదకరమైన మైనింగ్ ప్రమాదం బహుశా ఇదే కావొచ్చని అధికారులు భావిస్తున్నారు. అరిక్విపా నగరానికి సమీపంలోని లాఎస్పరెంజా 1వ గనిలో అగ్నిప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలుడు సంభవించడంతో మంటలు వ్యాప్తి చెందాయని, ప్రమాద సమయంలో గనిలో కార్మికులు వందమీటర్ల లోతులో పనులు చేస్తున్నామని తెలిపారు. నైట్ షిఫ్ట్ లో మొత్తం 200 మంది ఉండగా.. 175 మంది సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. మృతుల బంధువుల రోధనలతో ప్రమాద స్థలమంతా విషాదంగా మారింది. చనిపోయిన వారిలో 51 ఏళ్ల ఇడ్మే మమానీ భార్య.. అతనికోసం రోధించిన తీరు.. అందరినీ కలచివేసింది.
Next Story