Thu Dec 19 2024 07:12:35 GMT+0000 (Coordinated Universal Time)
నలుగురి కోసం.. 274 మంది బలి.. ఇదెక్కడి చిత్రంరా బాబూ
ఇజ్రాయిల్ చేపట్టిన దాడుల్లో 274 మంది పాలస్తానీయన్లు మరణించారు
ఇజ్రాయిల్ చేపట్టిన దాడుల్లో 274 మంది పాలస్తానీయన్లు మరణించారు. అయితే చిత్రం ఏంటంటే ఈ ఆపరేషన్ కేవలం నలుగురి కోసమే. నలుగురు బందీలను విడిపించడం కోసం ఇజ్రాయిల్ చేపట్టిన ఆపరేషన్ లో 274 మంది మరణించడం అంతర్జాతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సెట్రల్ గాజాలో పాలస్తీనియన్ల చేతిలో నలుగురు బందీలను విడిపించడం కోసం ఇజ్రాయిల్ ఈ దాడులు చేసింది.
70 మంది వరకూ...
ఈ దాడిలో 274 మంది మరణించడమే కాదు..700 మంది వరకూ గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను అల్ అఖ్సా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిన్న సెంట్రల్ గాజాలోని శరణార్ధి శిబిరంలో ఉన్న నలుగురు బందీలను విడిపించుకోవడం కోసం ఇజ్రాయిల్ దళాలు ఈ దాడికి దిగాయి. వారిని రక్షించాయి. అయితే ఈ సందర్భంగా ఇంత పెద్ద సంఖ్యలో పాలస్తానీయులు మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. అల్ అఖ్సా ఆసుపత్రి క్షతగాత్రులతో కిటకిటలాడుతుంది.
Next Story