Mon Dec 23 2024 14:23:38 GMT+0000 (Coordinated Universal Time)
హైవేపై ఢీ కొన్న 50 వాహనాలు, ముగ్గురు మృతి
అమెరికాలోని పెన్సిల్వేనియా హైవేపై సోమవారం భారీగా మంచు కురిసింది. దాంతో వాహనాల రాకపోకలకు అంతరాయం..
పెన్సిల్వేనియా : అమెరికాలో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. భారీగా మంచు పేరుకుపోవడంతో.. పెన్సిల్వేనియా హైవేపై వాహనాలు అదుపుతప్పి ఒకదానినొకటి ఢీ కొన్నాయి. సుమారు 50 వాహనాలు ఢీ కొన్న ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా హైవేపై సోమవారం భారీగా మంచు కురిసింది. దాంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో 50 నుంచి 60 వాహనాలు ఒకదానినొకటి ఢీ కొన్నాయి. వాటిలో కార్లు, ట్రాక్టర్ ట్రాలీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మంచును తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనెలలో ఇలాంటి ప్రమాదం జరగడం రెండవసారి అని స్థానిక పోలీసులు తెలిపారు.
Next Story