Tue Dec 24 2024 00:24:38 GMT+0000 (Coordinated Universal Time)
13 ఏళ్ల బాలుడితో అక్రమ సంబంధం.. బిడ్డ విషయంలో కోర్టు కీలక తీర్పు
బాలుడిని తన ఇంటికే పిలిపించుకుని మరీ ఈ సంబంధాన్ని కొనసాగించేది. పైగా ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని కోరింది. తరచూ బాలుడు..
చిన్న, పెద్ద, ముసలి-ముతక.. అక్రమ సంబంధాలకు ఇలాంటి తేడాలేవీ ఉండట్లేదు. వావి వరసలు అసలే లేవు. పక్కింట్లో ఉండే 13 ఏళ్ల బాలుడితో పరిచయం పెంచుకున్న ఓ మహిళ.. అతనితో శారీరక సంబంధం ఏర్పరచుకుంది. ఇప్పుడు ఆమె గర్భవతి కావడంతో విషయం కోర్టుకెళ్లింది. అయితే.. ఈ కేసులో ఎలాంటి తీర్పివ్వాలో తెలియక న్యాయమూర్తులు తలలు పట్టుకుంటున్నారు. అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన తాలూకా వివరాలు ఇలా ఉన్నాయి.
పొరిగింటి బాలుడితో పరిచయం పెంచుకున్న 31 సంవత్సరాల ఆండ్రియా సెరానో అనే మహిళ.. అక్రమ సంబంధం పెట్టుకుంది. బాలుడిని తన ఇంటికే పిలిపించుకుని మరీ ఈ సంబంధాన్ని కొనసాగించేది. పైగా ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని కోరింది. తరచూ బాలుడు ఆమె ఇంటికి వెళ్లినా.. ఇద్దరి మధ్య తల్లి-కొడుకు అంత వయసు తేడా ఉండటంతో ఎవరికీ అనుమానం రాలేదు. కానీ ఆండ్రియా గర్భం దాల్చడంతో.. విషయం బయటపడింది. దాంతో అక్కడి పోలీసులు ఆండ్రియాను లైంగికదాడి నేరం కింద అరెస్ట్ చేశారు. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉండటం నిజమేనని ఆమె విచారణలో అంగీకరించింది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు బాలుడే తండ్రి అని చెప్పింది.
కోర్టులో మహిళ చెప్పింది విన్న న్యాయమూర్తులు విస్తుపోయారు. ఎలాంటి తీర్పివ్వాలో తెలియక తలలుపట్టుకున్నారు. ఆమె గర్భవతి కావడంతో.. 70 వేల డాలర్ల (రూ. 57 లక్షలు) పూచీకత్తుతో బెయిలు మంజూరు చేశారు. ఇరు పక్షాల మధ్య రాజీ కుదరడంతో కేసును ముగించాలని కోర్టు నిర్ణయించింది. కానీ.. పుట్టబోయే బిడ్డకు మాత్రం బాలుడినే తండ్రిగా పరిగణించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story