Mon Dec 23 2024 06:21:04 GMT+0000 (Coordinated Universal Time)
దారుణం.. ఆస్పత్రి పైకప్పులో 500 మృతదేహాలు.. ఎక్కడినుంచి వచ్చాయి ?
ఆసుపత్రి పైకప్పుపై కనిపించిన ఈ మృతదేహాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దానిని చూసిన నెటిజన్లు భయభ్రాంతులకు..
ఆస్పత్రి పై కప్పులో 500 మృతదేహాలు బయటపడటం కలకలం రేపింది. ఈ ఘటన పాకిస్థాన్ లోని ముల్తాన్ లో ఉన్న పంజాబ్ నిష్టర్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. అక్కడి మృతదేహాల్లో చాలా భాగాలు కనిపించకుండా పోవడం మరో షాకింగ్ న్యూస్ అయింది. వాటిలో చాలా మృతదేహాలు ఛిద్రమవ్వగా.. మరికొన్ని మృతదేహాల నుంచి ఛాతీలు బయటపడ్డాయి. మృతదేహాలను చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కాగా.. ఆ మృతదేహాలు ఎక్కడివి ? ఆస్పత్రి పైకప్పు మీదికి ఎలా, ఎక్కడి నుంచి వచ్చాయన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
వీటికి సంబంధించిన సమాచారం ప్రస్తుతం తెలియాల్సి ఉంది. ఈ మృతదేహాల నుంచి అవయవాలను అక్రమంగా తరలించారని.. లేదంటే వైద్య పరీక్షల కోసం మృతదేహాల అవయవాలను విడదీసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆసుపత్రి పైకప్పుపై కనిపించిన ఈ మృతదేహాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దానిని చూసిన నెటిజన్లు భయభ్రాంతులకు గురవుతున్నారు. మృతదేహాల గురించిన పూర్తి సమాచారం తెలుసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఆరుగురు అధికారుల బృందం 3 రోజుల్లో నివేదికను అందజేస్తుంది గుర్తుతెలియని మృతదేహాలను వెలికితీసిన తర్వాత, ప్రావిన్స్ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు చౌదరి జమాన్ గుర్జార్ ఆసుపత్రిని సందర్శించారు. మృత దేహాలన్నింటికి దహన సంస్కారాలు నిర్వహించాలని, దీనిపై విచారణ జరపాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
Next Story