Fri Dec 20 2024 20:09:24 GMT+0000 (Coordinated Universal Time)
మూడ్రోజుల్లో 500 తిమింగలాలు మృతి
చాతమ్ దీవి వద్ద 250కి పైగా తిమింగలాలు మరణించి కనిపించాయి. మరో మూడు రోజుల తర్వాత సోమవారం కూడా పిట్ ఐలాండ్ తీరంలో 240కిపైగా
మూడ్రోజుల్లో సముద్ర తీరంలో 500 తిమింగలాలు మృతి చెందాయి. ఈ ఘటన న్యూజిలాండ్ లో జరిగింది. మూడ్రోజుల వ్యవధిలో 500 తిమింగలాలు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. న్యూజిలాండ్‌కు చెందిన మారుమూల చాతమ్ దీవుల్లో, సముద్రపు ఒడ్డున ఈ తిమింగలాలు మరణించి కనిపించాయి. గుంపులు గుంపులుగా పెద్దమొత్తంలో తిమింగలాలు మృతి చెందడం సంచలనంగా మారింది.
గత శుక్రవారం చాతమ్ దీవి వద్ద 250కి పైగా తిమింగలాలు మరణించి కనిపించాయి. మరో మూడు రోజుల తర్వాత సోమవారం కూడా పిట్ ఐలాండ్ తీరంలో 240కిపైగా తిమింగలాలు మరణించాయి. ఇవి పైలట్ వేల్స్ అనే ప్రత్యేక తిమింగలాలగా గుర్తించారు అధికారులు. తిమింగలాలు మరణించిన ప్రాంతం న్యూజిలాండ్ ప్రధాన భూభాగానికి దూరంగా ఉండటంతో వాటిని సంరక్షించే చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని అధికారులు తెలిపారు. సముద్రంలో విపరీతంగా ఉన్న షార్క్ చేపల దాడుల వల్లే అవి మరణించి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. కాగా.. మరణించిన తిమింగలాల్ని ఖననం చేయడం లేదని, సహజంగానే అవి తీరంలో కుళ్లిపోతాయని చెప్పారు అధికారులు. 1918లో కూడా ఒకసారి వెయ్యికిపైగా తిమింగలాలు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
Next Story