Sun Dec 22 2024 23:03:33 GMT+0000 (Coordinated Universal Time)
5000 మందికి గుడ్ బై చెప్పిన మస్క్
ఎలాన్ మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేశాక.. ఆ సంస్థలోని ఉద్యోగులను భారీగా తొలగించేస్తూ వస్తున్నాడు. ఎప్పటి నుండో ట్విట్టర్ లో ఉన్న చాలా మందిని బయటకు పంపించేసిన మస్క్.. పలువురిని పక్కన పెట్టడమే పనిగా ఫిక్స్ అయ్యాడు. తాజాగా సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. ఎలాన్ మస్క్ తీసుకున్న తాజా నిర్ణయంతో సుమారు 4,400 నుంచి 5,500 మంది ఔట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్టు తెలుస్తోంది. వారికి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే తొలగించినట్లు సమాచారం. కంపెనీ ఈ-మెయిల్, ఇంటర్నల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్తో ఉద్యోగులు యాక్సెస్ కోల్పోయిన తర్వాతే తాము ఉద్యోగాలు కోల్పోయినట్లు వారికి తెలిసిందట.
ఎలాన్ మస్క్ ట్విట్టర్ యూజర్లకు క్షమాపణ చెప్పారు. పలు దేశాల్లో ట్విట్టర్ సర్వర్లు డౌన్ కావడంతో ఆయన క్షమాపణ కోరారు. పెయిడ్ వెరిఫైడ్ సర్వీసు వల్ల ఫేక్ అకౌంట్లు ఎక్కువగా నమోదవుతుండటంతో ట్విట్టర్ యాజమాన్యం ఈ నిబంధనలు సవరించాలని నిర్ణయించింది. 8 డాలర్ల సబ్ స్ర్కిప్షన్ రూల్ ను వెనక్కి తీసుకుంది. వారం రోజుల్లో కొత్త నిబంధనలు వెల్లడిస్తామని ప్రకటించింది. 44 బిలియన్ డాలర్ల భారీ మొత్తంతో మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత సంస్థలో అనేక మార్పులు జరుగుతున్నాయి.
Next Story