Tue Dec 24 2024 19:36:48 GMT+0000 (Coordinated Universal Time)
Earth Quake: భూకంపం.. ఢిల్లీలో కూడా ప్రకంపనలు
సెప్టెంబర్ 11, బుధవారం పాకిస్థాన్లో రిక్టర్ స్కేల్పై 5.8 తీవ్రతతో భూకంపం నమోదైంది
సెప్టెంబర్ 11, బుధవారం పాకిస్థాన్లో రిక్టర్ స్కేల్పై 5.8 తీవ్రతతో భూకంపం నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం, పాకిస్థాన్లో మధ్యాహ్నం 12:58 గంటలకు(భారత కాలమానం ప్రకారం) భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 33 కిలోమీటర్ల లోతులో ఉంది. భారతదేశంలో ఢిల్లీ-ఎన్సిఆర్ ప్రాంతం, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, జమ్మూ కశ్మీర్ ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి.
పాకిస్థాన్ వాతావరణ శాఖ ప్రకారం, బుధవారం నాడు 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులతో, రాజధాని ఇస్లామాబాద్ లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత 5.4గా నమోదైందని.. భారత్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్లను ప్రభావితం చేసినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. భూకంపానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story