Mon Dec 23 2024 14:08:21 GMT+0000 (Coordinated Universal Time)
ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం
సాధారణంగా పసిఫిక్ మహా సముద్ర తీర దేశాల్లో భూకంపాలు వస్తుంటాయి. తాజాగా సంభవించిన భూకంపం కాస్త తీవ్రమైనదిగా..
ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. ఫిలిప్పీన్స్ దక్షిణ భాగంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూ ప్రకంపనలు రాజధాని అయిన మనీలా లో కూడా కనిపించాయి. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0 గా నమోదైంది. దాదాపు 30 సెకన్ల పాటు భూమి కంపించగా.. భూ కంప కేంద్రం మిండానావో ఐలాండ్ లోని దావో డి ఓరో ప్రావిన్స్ లో 38.6 కిలో మీటర్ల లోతులో ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్ జీఎస్) వెల్లడించింది.
సాధారణంగా పసిఫిక్ మహా సముద్ర తీర దేశాల్లో భూకంపాలు వస్తుంటాయి. తాజాగా సంభవించిన భూకంపం కాస్త తీవ్రమైనదిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
టర్కీ, సిరియా దేశాల్లో భూకంపాలు వచ్చినప్పటి నుంచీ ఏదొక ప్రాంతంలో ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి. గడిచిన రెండువారాల్లో భారత్ లోనూ పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఢిల్లీ, ఉత్తరాఖండ్ లతో పాటు ఏపీలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. తాజాగా కర్నూల్ లో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి.
Next Story