Fri Nov 22 2024 16:18:33 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ కంపించిన భూమి.. 6.1 తీవ్రతగా నమోదు
ఈ నెల 12న నేపాల్ లో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించగా.. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సిఆర్) నుండి ఉత్తరాఖండ్..
కొద్దిరోజులుగా జపాన్, నేపాల్, ఇండియా దేశాలతో పాటు.. పరిసర ప్రాంతాల్లో వరుస భూ ప్రకంపనలు భయపెడుతున్నాయి. జపాన్ లో సోమవారం మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 6.1గా నమోదైంది. ఉన్నట్టుండి భూమి ఊగడంతో.. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. తోబాకు ఆగ్నేయంగా 84 కిలోమీటర్ల దూరంలో భూ కంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 1.38 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ధృవీకరించింది.
ఈ నెల 12న నేపాల్ లో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించగా.. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సిఆర్) నుండి ఉత్తరాఖండ్ వరకూ ప్రకంపనలు వచ్చాయి. నేషనల్ ఎర్త్క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ నేపాల్ అధికారులు తెలిపిన వివరాల మేరకు..భూకంపం కేంద్రం బజాంగ్ జిల్లాలోని పటాడబుల్ వద్ద 10 కిలోమీటర్ల లోతులో 29.28 డిగ్రీల ఉత్తరం, రేఖాంశం 81.20 డిగ్రీల తూర్పున ఉంది. వారం వ్యవధిలో నేపాల్లో భూకంపం సంభవించడం ఇది మూడోసారి.
- Tags
- earthquake
- japan
Next Story