Sun Dec 22 2024 21:35:25 GMT+0000 (Coordinated Universal Time)
భారీ భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
అర్థరాత్రి వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.
ఇటీవల కాలంలో మళ్లీ భూకంపాలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో టర్కీ - సిరియా దేశాలను వరుస భూకంపాలు వణికించాయి. ఈ భూకంపాల ధాటికి వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ధనికులు, పేదవాళ్లంతా ఒకేచోటికి చేరారు. భారీ భవంతులు నేలకూలాయి. ఈ విషాదంలో ఎన్నో మరిచిపోలేని దృశ్యాలున్నాయి. తాజాగా మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. అర్థరాత్రి వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూ ప్రకంపనలతో ప్రజలు ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. దీనివల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
కాగా.. ఇటీవల భారత్ లోనూ వరుసగా భూప్రకంపనలు వచ్చాయి. కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్ లో నిన్న (జూన్ 18) ఐదు గంటల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపంచింది. ఆదివారం తెల్లవారుజామున 2.16 గంటలకు లేహ్ జిల్లాలో తొలుత భూప్రకంపనలు రాగా.. దాని తీవ్రత 4.1గా నమోదైనట్లు ఎన్ సీఎస్ తెలిపింది. భూ కంప కేంద్రాన్ని లేహ్ కు 295 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. శనివారం రాత్రి 9.44 గంటల సమయంలోనూ లేహ్ కు 271 కిలోమీటర్ల దూరంలో 4.4 తీవ్రతతో భూమి కంపించింది. అదేరోజు రాత్రి 9.55 గంటల సమయంలో జమ్ముకశ్మీర్ లో 4.5 తీవ్రతతో భూకంపం వచ్చింది.
Next Story