Mon Dec 23 2024 03:01:00 GMT+0000 (Coordinated Universal Time)
కాలిఫోర్నియాలో భారీ భూకంపం.. అంధకారంలో 12వేల మంది
ఉత్తర కాలిఫోర్నియాలోని యురేకా ప్రాంతంలో భూమి కంపించింది. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఫెర్న్ డాలేకు..
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. ఉత్తర కాలిఫోర్నియాలోని యురేకా ప్రాంతంలో భూమి కంపించింది. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఫెర్న్ డాలేకు 12 కిలోమీటర్ల దూరంలో.. 16.1 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం కారణంగా హంబోల్డ్ ట్ కౌంటీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా 12వేల మంది అంధకారంలో మగ్గుతున్నారు.
భూకంపం కారణంగా.. రోడ్లు, వాహనాలు ధ్వంసమవ్వగా.. పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇద్దరు తీవ్రగాయాలతో మరణించారు. వ్యాపార సంస్థలు, ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం కారణంగా ఎలాంటి సునామీ హెచ్చరికలు లేవని అధికారులు స్పష్టం చేశారు. శాన్ ఫ్రాన్సిస్కోకు ఉత్తరాన 420 కిమి, కాలిఫోర్నియాలోని యురేకా సౌత్ కు 31.54 కిమీ దూరంలో భూకంప కేంద్రం ఉంది. కాగా.. డిసెంబర్ 17న కూడా శాన్ జోస్ కు సమీపంలో 3.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Next Story