Sat Nov 23 2024 07:45:31 GMT+0000 (Coordinated Universal Time)
చైనాలో భారీ భూకంపం.. వణికిపోయిన ప్రజలు
చైనాకి వాయవ్య దిశలోని క్విఘాయిలో భూకంపం వచ్చినట్లు తెలిపారు. భూకంప సమయంలో అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు
డ్రాగన్ కంట్రీ అయిన చైనాలో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో.. స్థానిక ప్రజలు ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు భూమి కంపించగా.. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 6.9గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. చైనాకి వాయవ్య దిశలోని క్విఘాయిలో భూకంపం వచ్చినట్లు తెలిపారు. భూకంప సమయంలో అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు బయటికొచ్చాయి.
Also Read : కోవిడ్ ఎఫెక్ట్ : జనవరి 8 నుంచి స్కూల్స్ బంద్ !
మొదటిసారి కంపించినపుడు భూకంప తీవ్రత 4.1గా నమోదవ్వగా.. ఆ తర్వాత వరుసగా 3.0, 5.1 తీవ్రతతో రిక్టర్ స్కేలుపై నమోదైంది. మొత్తంగా మూడుసార్లు భూమికంపించినట్లు వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. జినింగ్ సిటీకి 136 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు అక్కడి జిన్హువా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఘాన్సూ, షాంగ్జీ, నింగ్జాయి ప్రావిన్సు ప్రాంతాల్లోనూ భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ భూకంపం కారణంగా ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగిందా ? లేదా అన్నదానిపై వివరాలేవీ తెలియరాలేదు.
Next Story