Mon Dec 23 2024 09:45:39 GMT+0000 (Coordinated Universal Time)
చర్చిలో కాల్పుల మోత.. ఏడుగురి మృతి
గురువారం (మార్చి9) రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు సమాచారం. అయితే మృతుల సంఖ్యపై..
జర్మనీలోని ఓ చర్చిలో కాల్పుల కలకలం రేగింది. హాంబర్గ్ నగరంలోని జెహోవాస్ విట్నెస్ సెంటర్ అనే చర్చిలో జరిగిన కాల్పుల్లో ఏడుగురు మృతిచెందగా మరో 8 మంది గాయపడ్డారు. గురువారం (మార్చి9) రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు సమాచారం. అయితే మృతుల సంఖ్యపై అధికారులు ఖచ్చితమైన వివరాలను వెల్లడించలేదు. అక్కడి మీడియా కథనాల మేరకు ఏడుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
ఆ ప్రాంతంలో తీవ్రప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో స్థానికులు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. కాల్పులు జరిగిన సమయంలో జెహోవా విట్నెస్ వర్గానికి చెందిన సభ్యులు బైబిల్ అధ్యయనం చేస్తున్నట్టు తెలుస్తోంది. నిందితుడు కూడా మరణించినట్టు సమాచారం.
Next Story