Mon Dec 23 2024 07:47:44 GMT+0000 (Coordinated Universal Time)
మూడేళ్లు టెంట్లోనే... ఏడు కోట్లు వచ్చి పడ్డాయి
మూడేళ్లు టెంట్ లోనే ఉన్న ఒక బాలుడికి ఏడు కోట్ల రూపాయల విరాళాలు అందాయి
మూడేళ్లు టెంట్ లోనే ఉన్న ఒక బాలుడికి ఏడు కోట్ల రూపాయల విరాళాలు అందాయి. ఈ నిధులను ఒక స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ప్రకటించి తన మంచి మనసును చాటుకున్నాడు. బ్రిటన్ కు చెందిన బాలుడు మ్యాక్స్ వూజీ తన ఇంటిపక్కనే ఉన్న రిక్ అబాట్ ఉండేవారు. ఆయన మ్యాక్స్ వుజీ కుటుంబానికి సన్నిహితుడు. అయితే ఆయన క్యాన్సర్తో చనిపోవడంతో మ్యాక్స్ వుజీ కొంత కలత చెందాడు. అంతకుముందే రిక్ అబాట్ మ్యాక్స్ వుజీకి ఒక టెంట్ బహుమానంగా ఇచ్చి ఏదైనా సాహసం చేయాలన్నాడు.
ఆరు బయట...
దీంతో 2020 నుంచి మూడేళ్ల పాటు ఇంటి బయట టెంట్లోనే ఉంటానని బాలుడు మీడియాకు తెలిపారు. ఇంట్లోకి ఎట్టిపరిస్థితుల్లో వెళ్లబోనని కూడా బాలుడు చెప్పడంతో మ్యాక్స్ వుజీకి మీడియా అండగా నిలిచింది. బాలుడు ఉద్దేశ్యాన్ని అందరికీ తెలియచేసింది. తనకు విరాళం రూపంలో వచ్చిన మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తానని బాలుడు ప్రకటించాడు. దీంతో విరాళాలు వెల్లువెత్తాయి. ఏడు కోట్ల విరాళాలు ఈ మూడేళ్లలో వచ్చి పడ్డాయి. దీనిని స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇచ్చేశాడు. బాలుడు మ్యాక్స్ వుజీని అభినందిస్తూ అనేక మంది ప్రశంసించారు. అనేక అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.
Next Story