Thu Nov 07 2024 21:54:29 GMT+0000 (Coordinated Universal Time)
ఉద్యోగులు ఒక్కొక్కరికీ ఆరుకోట్ల బోనస్
చైనాలోని ఒక కంపెనీఏకంగా తన ఉద్యోగులకు ఆరు కోట్ల రూాపాయల బోనస్ ప్రకటించడం చర్చనీయాంశమైంది
ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం చూశాం. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఉద్యోగాలు ఉండటమూ కష్టమే. అలాంటి పరిస్థితుల్లో ఒక కంపెనీ ఏకంగా తన ఉద్యోగులకు ఆరు కోట్ల రూాపాయల బోనస్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఉద్యోగులందరికీ కాదు. ఒక్కక్కరికీ ఆరు కోట్ల బోనస్ ను ఇచ్చి కంపెనీ యాజమాన్యం తన ఉదారతను చాటుకుంది. అది కూడా నోట్ల కట్టలను తెచ్చి మరీ ఉద్యోగులకు పంపిణీ చేసింది.
క్రేన్ల తయారీ కంపెనీ...
చైనాకు చెందిన హెనాన్ మైన్ కంపెనీ క్రేన్లను తయారు చేస్తుంటుంది. ఈ సంస్థకు భారీగా లాభాలు రావడంతో తమ కంపెనీలో కష్టపడిన ఉద్యోగులను సత్కరించాలని యాజమాన్యం నిర్ణయించుకుంది. అందులో భాగంగా సేల్స్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన 30 ఉద్యోగులను కంపెనీ యాజమాన్యం ఎంపిక చేసింది. 61 మిలియన్ యువాన్లు వారికి బోనస్ గా ఇచ్చింది.
కరెన్సీ కట్టలతో....
అంటే మన కరెన్సీలో 73 కోట్ల రూపాయలు పంచిపెట్టింది. 30 మంది ఉద్యోగుల్లో ముగ్గురికి ఒక్కొక్కరికి ఆరు కోట్ల రూపాయల బోనస్ ను చెల్లించింది. మిగిలిన వారికి 1.20 కోట్లు బోనస్ గా ఇచ్చింది. 73 కోట్ల రూపాయల నోట్లకట్టలను ఒకచోట పేర్చి ఉద్యోగులను పిలిచి ఇవ్వడంతో వారు బ్యాగ్ లలో మోసకెళ్లాల్సి వచ్చింది. తమకు పట్టిన అదృష్టంతో వారు బోనస్ తోనే కరోడ్ పతులలయ్యారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
- Tags
- china
- six crores
Next Story