Mon Dec 23 2024 09:10:27 GMT+0000 (Coordinated Universal Time)
ఉద్యోగులకు పెద్ద పార్టీ ఇచ్చి షాకిచ్చిన సైబర్ సెక్యూరిటీ సంస్థ
తొలుత సంస్థలో ఉద్యోగులందరికీ యాజమాన్యం పెద్దపార్టీ ఇచ్చింది. సైబర్ సూప్ పేరిట పార్టీ ఏర్పాటు చేసిన..
ఉద్యోగులను పిలిచి పెద్ద పార్టీ ఇచ్చింది. ఆ తర్వాత చావు కబురు చల్లగా చెప్పినట్లుగా.. కంపెనీలో 13 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చెప్పి షాకిచ్చింది. అమెరికాకు చెందిన ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ బిషప్ ఫాక్స్ ఇటీవల అనూహ్య రీతిలో ఉద్యోగులను తొలగించింది. తొలుత సంస్థలో ఉద్యోగులందరికీ యాజమాన్యం పెద్దపార్టీ ఇచ్చింది. సైబర్ సూప్ పేరిట పార్టీ ఏర్పాటు చేసిన ఈ పార్టీలో ఉద్యోగులకు ఖరీదైన బ్రాండెడ్ మద్యాన్ని అందించింది. ఆ మరుసటిరోజున సంస్థలో 50 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటన చేసి షాకిచ్చింది.
తమను ఇంత సడెన్ గా ఉద్యోగం నుండి తీసేస్తారని అస్సలు ఊహించలేదంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా వాపోయారు. మరికొందరు ఉద్యోగులు.. సంస్థ అంతర్గత మార్పుల్లో భాగంగా ఈ తొలగింపులు జరిగాయని అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థికరంగంలో తలెత్తుతోన్న ఇబ్బందుల కారణంగానే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు బిషప్ ఫాక్స్ వెల్లడించింది. గతంలో ఈ సంస్థ అవసరానికి మించి ఉద్యోగులను నియమించుకోవడం వల్లనే ప్రస్తుతం తొలగింపులు చేపట్టాల్సి వచ్చిందని కొన్ని వర్గాలు అభిప్రాయపడ్డాయి.
Next Story