Tue Dec 24 2024 13:06:43 GMT+0000 (Coordinated Universal Time)
సూడాన్ లో కూలిన బంగారు గని.. 38 మంది మృతి
సూడాన్ లోని ఒక బంగారు గనిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 38 మంది మృతి చెందారు
సూడాన్ లోని ఒక బంగారు గనిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 38 మంది మృతి చెందారు. బంగారం కోసం ఒక్క సారిగా ఎగబడటంతో ఆ గని కూలిపోయింది. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సూడాన్ రాజధాని ఖార్టోమ్ కు 700 కిలోమీటర్ల దూరలంో ఉన్న ఈ గనిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
మూసివేసినా....
ఈ బంగారు గనిని కొంతకాలం ప్రభుత్వం మూసివేసింది. అయినా ప్రజలు బంగారం కోసం ఆ గనిలోకి చొరబడటంతో గని కూలిపోయింది. మూసివేసిన గనిలోకి ప్రవేశించడం, అక్కడ భద్రత లోపాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. దీనిపై విచారణకు ఆదేశించింది.
Next Story